మంత్రి కేటీఆర్ నోట ‘డీజే టిల్లు’ డైలాగ్.. వైరల్ అయిన వీడియో

-

‘ అట్లుంటది మనతోని’  డిజే టిల్లు సినిమాలోని డైలాగ్ ఫేమస్ అయింది. అయితే ఈ డైలాగ్ మంత్రి కేటీఆర్ నోట వస్తే ఎలా ఉంటుంది. తాజాగా వరంగల్ పర్యటనలో తెలంగాణ యాస గురించి చెబుతూ…కేటీఆర్ ‘ అట్లుంటది మనతోని’ అని డైలాగ్ చెప్పారు. దీంతో ఇప్పుడు ఈ డైలాగ్ వీడియో చాలా వైరల్ అవుతోంది.

ఒకప్పుడు తెలంగాన యాస అంటే  సినిమాల్లో విలన్లకు, కమెడియన్లకు పెట్టే వారని… ప్రస్తుతం ట్రెండ్ మారిందని.. ఇప్పుడు తెలంగాన యాస లేనిదే సినిమాలు రావడం లేదని కేటీఆర్ అన్నారు. డీజే టిల్లు, బిల్లు ఇలా తెలంగాణ బాష లేకుంటే సినిమాలు నడుస్త లేవని.. ‘ ఇక అట్లుంటది మనతోని’ అనే విధంగా తెలంగాణ యాస సినిమాల్లో వాడుతున్నారని మంత్రి కేటీఆర్  అన్నారు. ఈ వీడియోను టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ రెడ్డి ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. గతంలో సీఎం కేసీఆర్ కూడా అసెంబ్లీ వేదికగా సినిమాల్లో తెలంగాణ యాస లేకుంటే నడవడం లేదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news