హైదరాబాద్ లో చెత్త ద్వారా 200 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది – కేటీఆర్‌

-

హైదరాబాద్ లో చెత్త ద్వారా 200 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. ఖైరతాబాద్ లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. హైదరాబాద్ నగరం తో పాటు పలు పురపాలికల్లో చెత్త నుంచి గ్యాస్ సేకరించి వంటకి, వాహనాలకు ఉపయోగించే కార్యక్రమాలను కూడా ప్రారంభించబోతున్నామని ప్రకటించారు.

ఇల్లు మాత్రమే నాది… నగరం నాది కాదు అనే బాధ్యతారాహిత్యం ప్రజల్లో ఉన్నన్ని రోజులు… ఎన్ని నిధులు ఖర్చుపెట్టిన నగరం సంపూర్ణంగా మారదని.. పురపాలనలో పౌరుల భాగస్వామ్యం లేకపోతే మార్పు సాధ్యం కాదని వెల్లడించారు. రెడ్యూస్, రీసైకిల్, రియూస్ అనే ట్రిపుల్ అర్ మంత్ర ఉంది. దీన్ని విస్తృతంగా ఆచరణలోకి తీసుకు వచ్చినప్పుడే పట్టణాలు మార్పు సాధ్యమవుతుందని వివరించారు.

ప్రజల అవసరాల మేరకు ప్లాస్టిక్ ప్రత్యామ్నాయలు అందుబాటులోకి వచ్చిన వెంటనే పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ నిషేధించడం సాధ్యమవుతుందని వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో ఉత్పత్తి అయ్యే వెట్ వేస్ట్ ద్వారా సుమారు 200 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని.. వ్యక్తులు కూడా సామాజిక బాధ్యతను గుర్తించి రెడ్యూస్, రీసైకిల్, రియూస్ మంత్ర పాటించాలని కోరారు. హైదరాబాద్ నగరం తో పాటు పలు పురపాలికల్లో చెత్త నుంచి గ్యాస్ సేకరించి వంటకి, వాహనాలకు ఉపయోగించే కార్యక్రమాలను కూడా ప్రారంభించబోతున్నామని స్పష్టం చేశారు కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news