రాహుల్‌ సిప్లిగంజ్‌ కరోనా పై స్పెషల్ సాంగ్.. రిలీజ్ చేసిన కేటీఆర్‌…!

-

కరోనా వైరస్ కట్టడిలో పోలీసులు వైద్య సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు సహా ఇతర సిబ్బంది పోషిస్తున్న పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వాళ్ల  కన్న పిల్లలను అందరినీ వదులుకొని రోడ్ల మీద ప్రజల ప్రాణాలు కాపాడడానికి తమ వంతుగా కృషి చేస్తున్నారు. ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా ఎవరు భయపడకుండా ప్రజల ప్రాణాల కోసం తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.

కరోనా వైరస్ వచ్చినప్పటినుంచి తెలంగాణ ప్రభుత్వం వారి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. వైద్య సిబ్బంది పై దాడులు చేసే వాళ్ళని కూడా క్షమించలేదు. తెలంగాణలో ఇక పారిశుధ్య కార్మికులకు, వైద్యులకు, పోలీసులకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గిఫ్ట్ కింద కొంత నగదు కూడా ఇస్తోంది. వైద్య సిబ్బంది పై ఎవరైనా దాడులు చేసినా సరే ఉపేక్షించేది లేదని మంత్రులు, ముఖ్యమంత్రి సహా ఇతర ఎమ్మెల్యేలు పదేపదే చెబుతూ వస్తున్నారు.

తాజాగా వారి కోసం ఒక పాటను కూడా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవి నిర్మించిన ఈ గీతాన్ని కందికొండ రాయగా..  రాహుల్‌ సిప్లిగంజ్‌ పాడారు. ప్రత్యేక గీతాన్ని మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. ఈ గీతం ప్రజల్లో మరింత అవగాహన, చైతన్యం కల్పిస్తుందని కేటీఆర్‌ అన్నారు. పాటను నిర్మించిన హైదరాబాద్‌ మేయర్‌ సతీమణికి అభినందనలు తెలిపారు. ఈ పాటను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news