వాతావరణ మార్పులతో పొంచి ఉన్న ముప్పు : కేటీఆర్

-

ట్విటర్‌లో యాక్టివ్‌గా ఉండే రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తాజాగా పర్యావరణంపై ఓ ట్వీట్ చేశారు. వాతావరణ మార్పులపై ట్విటర్ వేదికగా స్పందించారు. వాతావరణ మార్పులతో పుడమికి తక్షణ ముప్పు పొంచి ఉంది అన్నారు.

వాతావరణ మార్పులు తరచూ జరగకుండా.. సమతుల్యంగా ఉండాలంటే.. ఈ పుడమిని రక్షించుకోవాలంటే.. ‘తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయం’ తరహా కార్యక్రమాలు చేపట్టాలని కేటీఆర్ అన్నారు. సుస్థిరాభివృద్ధి, చెట్లపెంపకంపై భవిష్యత్ తరాలకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు.

రాష్ట్రంలో పచ్చదనం పెంచడానికి, వాతావరణం సమతుల్యంగా ఉండటానికి, వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి కేసీఆర్ సర్కార్ బృహత్కరమైన కార్యక్రమాలు చేస్తోందని కేటీఆర్ అన్నారు. ముఖ్యంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, అడవుల సంరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ వంటివి చేపడుతూ పర్యావరణాన్ని పరిరక్షిస్తోందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news