BREAKING : యువ గళం పాదయాత్రలో అపశృతి..లోకేష్‌ భుజానికి గాయం

-

BREAKING : యువ గళం పాదయాత్రలో మరో అపశృతి చోటు చేసుకుంది. యువ గళం పాదయాత్ర చేస్తున్నా నారా లోకేష్‌ భుజానికి గాయం అయింది. అయితే.. కుడి భుజం నొప్పితోనే నారా లోకేష్..పాదయాత్ర కొనసాగిస్తున్నారు. పలువురు మహిళలు తన కుడిచేయి పట్టుకొని థాంక్స్ చెప్పాలని చూడడంతో కుడి భుజం నొప్పిగా ఉందంటూ ఎడమ చేతితో థాంక్స్ చెప్పారు నారా లోకేష్.

దీంతో నారా లోకేష్‌ భుజానికి గాయం అయిందని తెలుస్తోంది. పాదయాత్ర చేస్తూ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డికి కుడి భుజం నొప్పిగా ఉందని చెప్పారు నారా లోకేష్. సెల్ఫీ తీసుకునే సమయంలో తన బిడ్డను ఎత్తుకొని ఫోటో తీసుకోవాలని లోకేష్ ను కోరగా తన చేయి నొప్పిగా ఉందంటూ మహిళతో చెప్పారు నారా లోకేష్. ఈ సంఘటన నేపథ్యంలోనే… ఈ విషయం బయటపడింది.

Read more RELATED
Recommended to you

Latest news