దుబ్బాకలో తెరాసకు ఇబ్బందిగా మారుతున్న అంశం ఇదేనా?

-

తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక చాలా కీలకంగా మారుతున్న సంగతి తెలిసిందే. అటు అధికారపక్షంతో పాటు ప్రతిపక్షాలకు కూడా ఈ ఉప ఎన్నిక అత్యంత కీలకంగా మారుతున్న ఈ పరిస్థితుల్లో ఇప్పటివరకూ అధికారపార్టీకి అంతా బాగుందని అనుకుంటున్న దశలో ఉన్నట్లుండి కాంగ్రెస్ కు ఒక కార్డు దొరికింది! అదే…  ఎల్.‌ఆర్.‌ఎస్‌!

అవును… ప్రస్తుతం తెరాస ప్రభుత్వ కొత్తగా తెరపైకి తెచ్చిన ఎల్.ఆర్.ఎస్. విషయంలో కాంగ్రెస్ పార్టీ కిలకమైన స్టేట్ మెంట్ ఇవ్వడంతో పాటు… ఆ స్కీం వల్ల ప్రజలు అనవసరంగా పన్నులు కడుతున్నారని చెప్పుకొస్తున్నారు కాంగ్రెస్ నేతలు! ఎల్.ఆర్.ఎస్. అనే ఆలోచన కేసీఆ తుగ్లక్ చర్య అనే విషయాన్ని ఎంత బలంగా తెరపైకి తీసుకెళ్తే.. అంతగా ప్రయోజనం ఉండొచ్చనేది కాంగ్రెస్ నేతల ఆలోచనగా ఉంది! ఇందులో భాగంగా మైకులందుకున్నారు టి.కాంగ్రెస్ నేతలు!

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఎల్.ఆర్.ఎస్. ను రద్దు చేస్తామని ప్రకటించారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ‌కుమార్‌ రెడ్డి! ఇదే సమయంలో.. ప్రజల ఆస్తుల వివరాలు గ్రామ పంచాయతీ రికార్డుల్లో నిక్షిప్తమై ఉన్నా.. పన్నుల భారం మోపేందుకే మళ్లీ సర్వేలు చేస్తున్నారని చెబుతున్నారు జీవన్ రెడ్డి. అక్రమ ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేసి ప్రభుత్వం తప్పు చేస్తే ప్రజలెందుకు జరిమానా కట్టాలని అడుగుతున్నారు! దీంతో.. ఈ స్వరాలు బలంగా జనాల్లోకి వెళ్తే మాత్రం.. తెరాసకు ఇబ్బందిగా మారే సూచనలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు!

 

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news