దేశ్‌కీ నేతగా కేసీఆర్‌.. తెలంగాణలో కేటీఆర్‌ ఉంటారు: మల్లారెడ్డి

-

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి నిన్న అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కు ఒకసారి దేశ్ కి నేతగా అవకాశం కల్పిస్తే… ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లు దేశాన్ని కూడా అభివృద్ధి చేస్తారని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ దేశ్ కి నేత అయితే… తెలంగాణలో మంత్రి కేటీఆర్… రాష్ట్రాన్ని పాలిస్తున్న అని చెప్పుకొచ్చారు మంత్రి మల్లారెడ్డి.

తెలంగాణ రాష్ట్రం ఎదుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఓర్వ లేక అనేక అడ్డంకులు సృష్టిస్తోంది అని ఆరోపించారు. అసెంబ్లీ లో వివిధ పనులపై జరిగిన చర్చ సందర్భంగా తమ శాఖకు సంబంధించిన అంశాలపై మంత్రి మల్లారెడ్డి మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికులు బుల్లెట్ బండ్లపై పనికి రావాలని అందుకోసం లక్ష రూపాయల సబ్సిడీతో మే నుంచి వాహనాలు ఇవ్వబోతున్నామని చెప్పారు.

కరోనా సమయంలో పులి బిడ్డలకు తెలంగాణ అడ్డ అయింది అని…. మల్లారెడ్డి అన్నారు. సారే జహాసే అచ్చా లో హిందుస్థాన్ కు బదులు తెలంగాణ గెలిచిందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ముందు దుబాయ్, గల్ఫ్ కూడా పనికి రావని వ్యాఖ్యానించారు. ఈఎస్ఐ ఆస్పత్రి లో మందులు అందక పోతే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news