తూర్పుగోదావరి జిల్లా : పోలవరం ప్రాజెక్టులో కీలక ఘట్టం పూర్తైంది. స్పిల్ వేలో 48 రేడియల్ గేట్ల అమరిక పనులు పూర్తి చేసింది మేఘా ఇంజనీరింగ్ సంస్ద. 2020 డిసెంబర్ 17న గేట్ల అమరిక పనులు ప్రారంభం అయ్యాయి. గత సీజన్ లో వరదలు వచ్చేనాటికి 42 గేట్లను అమర్చి, వరద నీటిని దిగువకు విడుదల చేయగా… మిగిలిన 6 గేట్ల అమరిక పనులు సైతం పూర్తి చేశారు.
ఇప్పటికే రేడియల్ గేట్లకు అమర్చాల్సిన 96హైడ్రాలిక్ సిలిండర్లకు గానూ 84 సిలిండర్లను అమర్చారు. త్వరలోనే మిగిలిన 6 గేట్లకు 12 సిలిండర్లు అమర్చేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. హైడ్రాలిక్ సిలిండర్లు అమర్చడం పూర్తైతే గేట్లు ఆపరేట్ చేయవచ్చు. గేట్లను ఎత్తడానికి అవసరమైన 24 పవర్ ప్యాక్ సెట్లను ఇప్పటికే అమర్చడం పూర్తి కానుంది.
10 రివర్ స్లూయిజ్ గేట్లను,వాటికి 20హైడ్రాలిక్ సిలిండర్ల తో పాటు 10 పవర్ ప్యాక్ సెట్లను కూడా అమర్చడం పూర్తి అవుతుంది. స్పిల్ వే కాంక్రీట్ పనులు దాదాపు 97.25శాతం పైగా పూర్తి కాగా.. స్పిల్ వే లో 3,32114 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను పూర్తి చేశారు.స్పిల్ వే లో కీలకమైన ఫిష్ ల్యాడర్ నిర్మాణం సైతం పూర్తి చేయగా.. గేట్ల ఏర్పాటు పనులను దగ్గరుండి పరిశీలించారు జలవనరుల శాఖ అధికారులు.