ఈ నెల 5న వరంగల్‌ వెళ్లనున్న మంత్రి కేటీఆర్….

-

ఈ నెల 5న వరంగల్‌ జిల్లాలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ మేర‌కు బుధ‌వారం హ‌న్మకొండ‌లోని మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు తన క్యాంపు కార్యాల‌యం ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్కర్‌, మేయ‌ర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు అరూరి ర‌మేశ్‌, తాటికొండ రాజ‌య్య‌, న‌న్నప‌నేని న‌రేంద‌ర్‌, ఒడితెల స‌తీశ్‌, డీసీసీబీ చైర్మన్ మార్నేని ర‌వింద‌ర్ రావు, కుడా చైర్మన్ సుంద‌ర్ యాద‌వ్ త‌దిత‌రుల‌తో స‌మీక్ష నిర్వహించారు. కేటీఆర్ పర్యటన ఏర్పాట్లపై వారికి దిశానిర్దేశం చేశారు. ఈ నెల 5న ఉదయం 10 గంటలకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల‌తోపాటు పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు హసన్ పర్తి (ఎర్రగట్టు గుట్ట) కిట్స్ కళాశాలలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంక్యుబేషన్ సెంటర్ను ప్రారంభించి, అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిట్స్‌ను తిలకిస్తారు. అనంతరం హెచ్ఓడీలు, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు హసన్ పర్తి బాలాజీ గార్డెన్స్‌లో కేసీఆర్ కప్‌ను విజేత‌ల‌కు అంద‌జేస్తారు. సాయంత్రం 4.30 గంటలకు హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.

Minister KTR | ఈ నెల 5న వరంగల్‌లో మంత్రి కేటీఆర్‌ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

సాయంత్రం 5.30 గంటలకు హంటర్ రోడ్‌లో సైన్స్ సెంటర్‌ను ఆరంభిస్తారు. సాయంత్రం 5.50 గంటలకు లష్కర్ బజార్ మర్కజీ స్కూల్లో నగరంలోని వివిధ అభివృద్ధి పనులకు శంకు స్థాపనలు చేస్తారు. సాయంత్రం 6.15 గంటలకు గాంధీనగర్‌లో (అంబేద్కర్ భవన్, టీవీ టవర్ దగ్గర) మోడల్ వైకుంఠ ధామాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం 6.45 గంటలకు సెయింట్ గ్యాబ్రిల్ స్కూల్లో పార్టీ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా ప్రసంగిస్తారు. ఈ మొత్తం కార్యక్రమాల విజ‌య‌వంతానికి కృషి చేయాల‌ని మంత్రి ఎర్రబెల్లి ఆయా నేత‌ల‌కు విజ్ఞప్తి చేశారు. అధికారిక కార్యక్రమాల్లో అధికారులు భాగ‌స్వాముల‌వుతారని, పార్టీ కార్యక్రమాల్లో మాత్రం పార్టీ నేత‌లు, కార్యక‌ర్తల‌ను విస్తృతంగా పాల్గొనేలా చూడాల‌ని మంత్రి సూచించారు. ఈ పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news