త్వరలోనే హైదరాబాద్ చుట్టూ మెట్రో సేవలు ప్రారంభిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. హైదరాబాద్ 2వ విడత మెట్రోకు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగించారు. అన్ని వర్గాలను అక్కున చేర్చుకున్న విశ్వనగరం హైదరాబాద్.. మెట్రో.. ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీతో ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు సీఎం కేసీఆర్.
సమశీతల వాతావరణ నగరం హైదరాబాద్.. సమైక్య పాలకుల నిర్లక్ష్యానికి గురైంది.. గతంలో కరెంట్, మంచినీటి కష్టాలు ఉండేవి.. ఇప్పుడు అన్ని సమస్యలను అధిగమించామని తెలిపారు. హైదరాబాద్‌ను పవర్ ఐల్యాండ్‌గా మార్చాం.. న్యూయార్క్, లండన్‌లోనైనా కరెంట్ పోవచ్చు.. కానీ, హైదరాబాద్ నగరంలో మాత్రం పవర్ పోదని పేర్కొన్నారు సీఎం కేసీఆర్. హైదరాబాద్ చుట్టూ కూడా మెట్రో రావాల్సి ఉంది.. కేంద్రం సహకరించినా లేకున్నా మేం పూర్తి చేస్తామని ప్రకటించారు సీఎం కేసీఆర్.