కెసిఆర్ దయతో ఆరోగ్యశాఖ మంత్రిని అయ్యాను – హరీష్ రావు

నేడు సిద్దిపేటలో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల దయ, కేసీఆర్ దయతో ఆరోగ్య శాఖ మంత్రిని అయ్యారన్నారు హరీష్ రావు. ఇక మరోసారి బిజెపిపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ఉన్న బీజేపీ వాళ్లకు వడ్లు కొనడం చేత కాదని.. నూకలు బుక్కుమని అంటున్నారని మండిపడ్డారు.

“కాళేశ్వరం నీళ్లతో పెద్ద వాగు ను నింపుతాం..దింతో ఎప్పటికి వాగులో నీళ్లు ఉండడంతో ఇసుక దొంగలకు ఇసుక దొరుకదు. కరోనాతో రైతుబాందు ఇవ్వమని అనుకున్నాం. కానీ ఎమ్మెల్యే, ఉద్యోగుల జీతాలు ఆపి.. రైతు బంధు ఇచ్చారు. బండి సంజయ్.. నేను అడుగుతున్న మోటర్లకు మీటర్లు పెట్టకుంటే 5 ఏండ్లలో రూ.30 వేల కోట్లు ఎందుకు ఆపినారు.హరీష్ రావు, సిద్దిపేట ను అభివృద్ధి చేస్తుండని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఏడుస్తున్నారు. నాకు 8 ఏండ్లయే బి.పి , షుగర్ వచ్చి , ఈ తిరుగుళ్లకు, టెన్షన్ లకు , రోజుకు రెండు పూటల మందులు వేసుకుంటున్నా” అన్నారు మంత్రి హరీష్ రావు.