BREAKING : విష్షువర్దన్ రెడ్డి ఇంటికి మంత్రి హరీష్ రావు

-

BREAKING : కాంగ్రెస్‌ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. జూబ్లిహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్షువర్దన్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీలో చేరాలని జూబ్లిహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్షువర్దన్ రెడ్డిను ఆహ్వానించారు హరీష్ రావు. దీంతో త్వరలోనే జూబ్లిహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్షువర్దన్ రెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని విష్షువర్దన్ రెడ్డి కూడా తెలిపారు. త్వరలోనే బీఆర్‌ఎస్‌ పార్టీ కండువా కప్పుకుంటానన్నారు.

Minister Harish Rao reached Visshuvardhan Reddy’s house

ఇక ఇది ఇలా ఉండగా… నిన్న ప్రగతి భవన్‌ లో బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్‌తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్ధన్ రెడ్డి. కాగా.. కాంగ్రెస్‌ పార్టీ తరఫున జూబ్లీహిల్స్‌ నియోజక వర్గం నుంచి బరిలో ఉండాలని మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి అనుకున్నారు. కానీ.. కాంగ్రెస్‌ టికెట్ అజారుద్దీన్‌ కు దక్కింది. బీఆర్‌ఎస్‌ టికెట్‌ కూడా ఇప్పటికే ప్రకటించారు. ఇక ఇప్పుడు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి.. అజారుద్దీన్‌ ను ఓడించేందుకు సిద్ధం అవుతున్నారు విష్ణు వర్ధన్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version