రంగనాయక సాగర్ ఎడమ కాలువ ద్వారా సాగునీరు విడుదల చేశారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. ఈ ఎడమ కాలువ ద్వారా మొదటి విడత 100 క్యూసెక్కులు, రెండవ విడత 300 క్యూసెక్కులు.. నారాయణరావుపేట – చిన్నకోడూర్ మండలాల్లోని పలు గ్రామాలు కలుపుకుని మొత్తం 512 క్యూసెక్కుల నీటిని నారాయణరావుపేట మండలం చెరువు, కుంటలు, వాగులు, వంకల్లోకి జలాలు విడుదల చేశామన్నారు.
ఈ చెరువుల్లోకి నీరు చేరడంతో నారాయణరావుపేట మండల పరిధిలోని 4 గ్రామాల రైతులకు ఏంతో మేలు చేకూరనున్నదని తెలిపారు. నారాయణరావుపేట మండలం పరిధిలో 41 వాటర్ బాడీస్ లలోని చెరువులు, చెక్ డ్యాములు, కుంటలు, వాగులు, వంకల ద్వారా 2840 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని తెలిపారు.