సర్జికల్‌ స్ట్రైక్స్‌పై దిగ్విజయ్‌ వ్యాఖ్యలను ఖండించిన రాహుల్‌ గాంధీ

-

సర్జికల్‌ స్ట్రైక్స్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఖండించారు. ఆయన అభిప్రాయాలతో పార్టీకి సంబంధం లేదని రాహుల్ స్పష్టం చేశారు. భారత్‌ జోడో యాత్రలో భాగంగా జమ్మూలో పర్యటిస్తున్న రాహుల్‌.. నేడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో దిగ్విజయ్ వ్యాఖ్యలపై రాహుల్ స్పందించారు.

‘‘ఆయన వ్యక్తిగత అభిప్రాయాలను మేం అభినందించట్లేదు. అవి విరుద్ధమైనవి. వీటితో పార్టీకి సంబంధం లేదు. పార్టీ అభిప్రాయాలు చర్చల నుంచే వెలువడుతాయి. మన సాయుధ బలగాల సామర్థ్యం మాకు తెలుసు. వారు అసాధారణ విధులు నిర్వర్తించగలరని మేం స్పష్టంగా ఉన్నాం. వాళ్లు ఎలాంటి రుజువులు చూపించాల్సిన అవసరం లేదు’’ అని రాహుల్‌ వెల్లడించారు. అటు కాంగ్రెస్‌ పార్టీ కూడా దిగ్విజయ్‌ వ్యాఖ్యలకు స్పందించకుండా దూరం జరిగింది.

అసలేం జరిగిందంటే.. సర్జికల్‌ స్ట్రైక్స్ చేసి చాలామంది ముష్కరుల్ని చంపినట్లు చెబుతున్న కేంద్ర ప్రభుత్వం.. దానికి తగ్గ రుజువుల్ని మాత్రం ఇప్పటివరకు ఎందుకు చూపించలేకపోతోందని కేంద్రాన్ని ప్రశ్నించారు. పుల్వామా ఘటనపైనా ప్రభుత్వం ఇప్పటివరకు నివేదిక సమర్పించలేదని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news