ఏపీ లో సీఎం జగన్ స్థాపించిన వాలంటీర్ వ్యవస్థ సమాజం లో ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రతిపక్షాలు సైతం వాలంటీర్ వ్యవస్థని ముట్టుకుంటే డిపాజిట్స్ కూడా దక్కని పరిస్థితి ఆంధ్ర ప్రదేశ్ లో నెలకొంది. టీడీపీ, జనసేన పార్టీలు గతం లో వాలంటీర్ వ్యవస్థ మీద ఎలాంటి కామెంట్స్ చేసాయో, ఇప్పుడు ఆ వ్యవస్థ పై వరాల జల్లు కురిపిస్తూ మాటలు ఎలా మార్చారో మనమంతా చూస్తూనే ఉన్నాం.
ప్రభుత్వ పథకాలు డోర్ డెలివరీ చేయడం అనేది దేశం లో మొట్టమొదటిసారి ఆంధ్రాలోనే ఎంతో పారదర్శకంగా జరిగింది. ఇప్పుడు ఈ మోడల్ ని ఇత్తర రాష్ట్రాల్లో కూడా అనుసరించడానికి ప్రభుత్వాలు మొగ్గు చూపుతున్నాయి. తెలంగాణ లో త్వరలోనే ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తామని.. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ వ్యవస్థ ద్వారా లబ్దిదారులకు ఎంతో మేలు జరిగిందని తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పుకొచ్చారు. నల్గొండ నియోజకవర్గంలో ఎన్నికల తరువాత వాలంటర్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. ప్రతీ గ్రామానికి ఒక వాలంటీర్ ను ఏర్పాటు చేసి.. ఆ వాలంటీర్లకు ప్రతీనెల రూ.5వేల ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా చెల్లిస్తామన్నారు. గ్రామ వాలంటీర్లను సమన్వయం చేసేవిధంగా మండల స్థాయిలో వాలంటీర్ ను నియమిస్తామన్నారు.