అలా జరగకుండా చూడండి: కేటిఆర్ సీరియస్ వార్నింగ్

జిహెచ్ఎంసి లో హౌసింగ్ కార్యక్రమాలపై ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ సమీక్ష చేసారు. ఈ సమీక్షకు మంత్రి ప్రశాంత్ రెడ్డి మున్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ హాజరయ్యారు. జిహెచ్ఎంసి లో ఇప్పటికే లక్ష బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం జరుగుతోందని కేటిఅర్ అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణం పూర్తయ్యేలోపు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు.

ktr
ktr

గతంలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పొందిన వారికి మరోసారి ఇళ్లు రాకుండా దృష్టి పెట్టాలని అయన అధికారులకు సూచనలు చేసారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా అధికారులు చూడాలన్నారు మంత్రి. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లో గ్రీనరీ కి ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేసారు. త్వరలోనే మరోసారి హౌసింగ్ శాఖ అధికారులతో సమావేశం అవుతా అన్నారు.