మెగా డీఎస్సీ ద్వారా 11వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసాం : మంత్రి పొంగులేటి

-

రాష్ట్ర సాధనలో రాష్ట్రంలో ఉన్న అన్ని ఉద్యోగ సంఘాలు పోరు చేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మీ అందరి పోరాట ఫలితమే ఇందిరమ్మ రాజ్యం అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో బావ స్వేచ్ఛను కోల్పోయాం. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. సంవత్సరానికి 54 వేల కోట్లు అప్పు చేస్తే గత ప్రభుత్వం చేసిన అప్పు కు మిస్తి కట్టటానికి సరిపోతుంది. ఉద్యోగస్తులకు ఎంత చేసినా తక్కువే. మీకు మొత్తం ఐదు డిఏలు ఆగిన మాట వాస్తవం. మూడు డిఏలు ఇవ్వాల్సి ఉంది. ఆర్థికేతర విషయాలు ఈ క్యాలెండర్ మారే లోపే చేపిచ్చే బాధ్యత నాదే. గత ప్రభుత్వాలు ఖమ్మం జిల్లా పనికిరాదని అన్నారు.

కానీ ఇప్పుడు ఖమ్మం జిల్లా నే ప్రభుత్వానికి ఆయు పట్టు. మీ అందరి ప్రేమ, దీవెన, ఆశీస్సులు, అభిమానాలతో ఎన్నికల ముందు సవాల్ చేశాం. ఎన్నికల ముందు ఇక్కడ ఉన్న అనేకమంది నాయకులు స్వేచ్ఛగా మాట్లాడలేకపోయారు. ఈ రాష్ట్రంలో వ్యక్తిని కానీ వ్యక్తులను కానీ ప్రజా ప్రతినిధులను కానీ ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రసక్తే లేదు. రాష్ట్రం లో ఇంకా కొంతమంది పింక్ కలర్ మైకం లోనే ఉన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వలేదు. ఇందిరమ్మ రాజ్యంలో 37వేల మందికి ప్రమోషన్లు ఇచ్చాం. మెగా డీఎస్సీ ద్వారా 11వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసాం. కానీ కొంతమంది మతిభ్రమించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎన్నికలు పెడితే సెంచరీ కొడతారంట… గత పార్లమెంట్ ఎన్నికల్లో డక్ ఔట్ అయ్యారు అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news