బీజేపీకి డిపాజిట్ దక్కదు.. రెండో స్థానం కాంగ్రెస్ దే : మంత్రి ప్రశాంత్ రెడ్డి

-

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో జోష్ ని పెంచింది టీఆర్ఎస్ పార్టీ. ప్రచారానికి గడువు సమీపిస్తున్న కొద్ది పార్టీ ముఖ్యనేతలు మునుగోడు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. రోడ్ షోలు, ఇంటింటి ప్రచారం, సభలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో పర్యటించారు.

బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి డిపాజిట్‌ కూడా దక్కదని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీ భారీ మెజార్టీతో గెలువబోతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి రెండోస్థానం దక్కే అవకాశం ఉందని అన్నారు. చౌటుప్పల్ మండలం డీ నాగరామ్‌ గ్రామంలో యువజన సభ్యులు నిర్వహించిన వాలీబాల్‌ టోర్నమెంట్‌ ఫైనల్ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా మంత్రి ప్రశాంత్ రెడ్డి హాజరై ప్రారంభించారు.

రాజగోపాల్‌ రెడ్డి స్వలాభం కోసమే అమ్ముడుపోయి ఈ ఉప ఎన్నిక తీసుకొచ్చాడని మంత్రి వేముల ధ్వజమెత్తారు. మునుగోడు ప్రజలు ఆయనకు తప్పకుండా బుద్ధి చెప్తారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news