బర్గర్‌కు పేరుపెట్టి రూ. 2 లక్షలు కొట్టేయండి..! ఆఫర్‌ అదిరిందిగా..!

-

ఈరోజుల్లో పిజ్జా, బర్గర్లు తినని వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు కదా.. ఇవి తినే వాళ్లకు అయితే వీటిల్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఏది టేస్టీగా ఉంటుంది అనేది బాగా తెలుస్తుంది..మీకు బర్గర్లంటే ఇష్టం అయితే ఈ బంపర్‌ ఆఫర్‌ మీ కోసమే.. ఓ కంపెనీ.. బర్గర్ తినే వారి కోసం డబ్బు చెల్లించబోతోంది. అది కూడా తక్కువేమీ కాదు… అక్షరాలా రూ.2లక్షలు. అసలేంటి ఆఫర్‌, ఏం కంపెనీ ఈ వివరాలు అన్నీ మీకోసం..!

Hamburger with wrapping paper on white background.

ప్రముఖ బర్గర్ చైన్ కంపెనీ ఫ్లేమింగ్ గ్రిల్ ఈ అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది.. ఈ కంపెనీ ఒక పోటీని నిర్వహిస్తోంది. ఈ పోటీ ఆన్‌లైన్ వేదికగా జరుగుతుంది. ఈ పోటీలో పాల్గొనేవారు బర్గర్‌కు పేరు పెట్టాలి. ఆ పేరు నచ్చితే కంపెనీ ఆమోదిస్తుంది.. ఈ బర్గర్ టాపింగ్స్‌లో చీజ్, పిరి పిరి సాస్, అపెలినోస్, చికెన్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ బర్గర్‌ను స్టింగర్ బర్గర్ అని పిలుస్తున్నారు. ఈ బర్గర్‌కు అత్యంత ప్రత్యేకమైన పేరును పెట్టే వ్యక్తికి రూ.2 లక్షల బహుమతి ఇస్తారట.

ఈ పోటీలో పాల్గొనేవారి కోసం కంపెనీ ఆన్‌లైన్ ఎంట్రీలను కూడా కంపెనీ ఆహ్వానించింది. ప్రస్తుతం ఆన్‌లైన్ ఎంట్రీని మూసివేసినట్లు సమాచారం. మరి ఇంకెందుకు ఆలస్యం.

మార్కెటింగ్‌ కోసమే..

మార్కెట్‌లో ఉండే ఏ వస్తువు అయినా.. కష్టమర్లకు దగ్గర అవ్వాలంటే.. ముందు దాని ప్యాకింగ్‌, పేరు యునిక్‌గా ఉండాలి.. టేస్ట్‌, క్వాలిటీ కొంటే కానీ తెలియదు.. కానీ కొనేవరకు రావాలంటే.. ముందు అది కష్టమర్‌ను ఆకర్షించాలి కదా..! అందుకే అన్ని అడ్వర్‌టైజింగ్‌ ఏజెంట్‌లు, కంపెనీలు ఇదే రూల్‌ను ఫాలో అవుతాయి. చిన్నపిల్లలకు సంబంధించినవి అయితే.. ఎక్కువ కలర్‌ ఫుల్‌గా ఉంటాయి.. మీరు గమనించండి.. ఎందుకంటే.. పిల్లలకు రంగురంగులుగా ఉండేవి అంటే ఇష్టం.. అది వారికి త్వరగా కంట్లో పడుతుంది. దాంతో అవి కొనాలని మారం చేస్తారు.. బిజినెస్‌ ఐడియా ఇది..! ఇక పెద్దవాళ్లు రంగులకు పెద్దగా యట్రాక్ట్‌ అవరు కాబట్టి వీళ్లను బుట్టలో పడేయాలంటే.. పేరు భిన్నంగా ఉండాలి.. ఏంట్రా ఈ పేరు వెరైటీగా ఉంది.. ఎంత బాగుంటుందో అన్నట్లు వాటిని విక్రయిస్తారు. ఇక్కడ ఈ బర్గర్‌ కంపెనీ కూడా ఇదే ఫాలో అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news