ఫామ్‌హౌస్ కేసు.. నిందితుల కస్టడీ పిటిషన్‌ కొట్టివేత

-

మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేలకు ఎర కేసుకు సంబంధించి సిట్‌ అధికారులకు ఏసీబీ ప్రత్యేక కోర్టులో చుక్కెదురైంది. ముగ్గురు నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ సిట్‌ వేసిన పిటిషన్‌ను ఏసీబీ న్యాయస్థానం కొట్టివేసింది. ముగ్గురు నిందితుల నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని పోలీసుల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దర్యాప్తులో భాగంగా కొంత సమాచారం లభించిందని.. నిందితులను ప్రశ్నించి స్పష్టత తీసుకోవాల్సి ఉందని చెప్పారు. ఇది వరకు కేవలం 2 రోజులు మాత్రమే కస్టడీకి ఇవ్వడంతో పూర్తి స్థాయిలో ప్రశ్నించలేకపోయామని మరో ఐదురోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు.

ఆ వాదనతో నిందితుల తరపు న్యాయవాది వ్యతిరేకించారు. ముగ్గురు ఇప్పటికే 25 రోజులుగా జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్నారని పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసుతో వారు బాధితులయ్యారని కోర్టుకు వివరించారు. బెయిల్ మంజూరు చేయాలని సుప్రీం కోర్టు హైకోర్టుకు సూచించిందని ఈ తరుణంలో కస్టడీకి ఇవ్వొద్దని నిందితుల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరువైపుల వాదనలు విన్న ఎసీబీ ప్రత్యేక న్యాయస్థానం సిట్‌ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను కొట్టివేసింది.

Read more RELATED
Recommended to you

Latest news