బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. అబద్దాలకు నిలువెత్తు నిదర్శనం ఎంపీ అరవింద్ అని విమర్శించారు. అరవింద్ కుటుంబానిది దిక్కుమాలిన చరిత్ర అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. వారి కుటుంబంలో ముగ్గురు మూడు పార్టీలలో ఉన్నారని ఎద్దేవా చేశారు. అరవింద్ ని చూస్తేనే తమకు అసహ్యం అని, ఆయన రాజకీయాలకు అతిపెద్ద కలంకమని అన్నారు.
దమ్ముంటే వ్యక్తిగతంగా మాట్లాడాలి కానీ.. వ్యక్తిగతంగా విమర్శించడం సరికాదని హితవు పలికారు. కవిత ఇంటిపై బిజెపి వాళ్ళు దాడి చేస్తే ఈ గవర్నర్ ఎక్కడ పోయింది ? అని ప్రశ్నించారు. ఇవాళ అరవింద్ ఇంటి విషయం పై గవర్నర్ మాట్లాడుతుందని మండిపడ్డారు. బండి సంజయ్ బిజెపి అధ్యక్షుడు అయిన తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు దిగజారి పోయాయన్నారు ప్రశాంత్ రెడ్డి.