కేసీఆర్ సర్కార్.. దళిత బందు పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు. ఒక దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకునేందుకు ఈ పథకాన్ని తీసుకు వచ్చింది ప్రభుత్వం. ప్రస్తుతం ఈ పథకం నూటికి నూరుశాతం విజయవంతంగా కొనసాగుతోంది.
ఈ తరుణంలో దళిత బంధు పథకం పై కొమురవెల్లిలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సిఎం కెసిఆర్ కు ఓట్లు వేసే వాళ్ళకే దళిత బంధు లిస్ట్ లో పేరు పెట్టాలని కామెంట్స్ చేశారు ముత్తిరెడ్డి. తెలంగాణ సోయి ఉన్నవాళ్లకు దళిత బంధు అని చెప్పారు ముత్తిరెడ్డి. అయితే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాజకీయ లబ్ది కోసం దళిత బంధు ను తీసుకురాలేదని.. నియోజకవర్గంలో దళితుల అభివృద్ధి ధ్యేయమన్నారు.