మళ్లీ గులాబీ గూటికి నల్లాల ఓదెలు దంపతులు

చెన్నూరు నియోజకవర్గంలోని కీలక నేత, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు మళ్లీ గులాబీ గూటికి చేరనున్నారు. ఎంపీ టికెట్ కావాలని అడిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఓదెలు దంపతులు గులాబీ కండువా కప్పుకోనున్నారు. నేడు టిఆర్ఎస్ లో చేరుతున్నట్లుగా ఓదెలు తెలిపారు. నేడు ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ తో సమావేశం కానున్న నల్లాల ఓదెలు దంపతులు అనంతరం తిరిగి టిఆర్ఎస్ పార్టీలోకి రానున్నారు.

ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లాల ఓదేలు దంపతులు తిరిగి గులాబీ గూటికి చేరారు. మరోవైపు టిపిసిసి అధికార ప్రతినిధి, తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు ఓరుగంటి వెంకటేశం గౌడ్ టిఆర్ఎస్ లో చేరారు. మంగళవారం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆయనని గులాబీ కండువా కప్పి టిఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. రాష్ట్ర అభివృద్ధికి టిఆర్ఎస్ చేస్తున్న కృషి, సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి టిఆర్ఎస్ లో చేరుతున్నానని వెంకటేశం గౌడ్ పేర్కొన్నారు.