పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసులో నాంపల్లి కోర్టు కీలక తీర్పు

-

పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసులో నాంపల్లి కోర్టు కీలక తీర్పుని వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న శేషన్నను నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. 11 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పు విలువరించింది నాంపల్లి కోర్టు. 2012 డిసెంబర్ 27న పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే కేసు నమోదు చేసిన సుల్తాన్ బజార్ పోలీసులు 20 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఇక ఫిబ్రవరి 2018లో ప్రధాన నిందితుడు శేషన్నను అరెస్టు చేశారు. దీనిపై 11 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం శేషన్నను నిర్దోషిగా ప్రకటిస్తూ నాంపల్లి కోర్టు తీర్పును వెలువరించింది. అయితే పరిటాల రవి హత్య కేసులో పటోళ్ల గోవర్ధన్ రెడ్డి నిందితుడిగా ఉన్నాడు. తగిన ఆధారాలు లేకపోవడంతో అతన్ని కోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది. దాంతో గోవర్ధన్ రెడ్డి హైదరాబాదులోని చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. అయితే జైలు నుంచి విడుదలైన అనంతరం పరిటాల రవి హత్య కేసులో ఆయన సంచలన ప్రకటనలు చేశారు. అనంతరం హత్యకు గురి కావడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news