రామగుండం ఫెర్టిలైజర్స్ లో ఉత్పత్తి ఆపివేయాలని ఉత్తర్వులు జారీ

-

పెద్దపెల్లి జిల్లాలోని రామగుండం ఫెర్టిలైజర్స్ లో ఉత్పత్తి నిలిపివేయాలని కాలుష్య నియంత్రణ మండలి(PCB) ఉత్తర్వులు జారీ చేసింది. వారం రోజుల పాటు కర్మాగారంలో పిసిబి తనిఖీలు చేపట్టింది. ఏడాది కాలంగా ఇక్కడ ఉత్పత్తి జరుగుతోంది. అధికారికంగా ఈ నెల 26న ప్రధాని మోదీ దీనిని ప్రారంభిస్తారని ప్రచారం జరిగింది. ఈ పరిశ్రమపై కొంత కాలంగా అనేక ఫిర్యాదులు వచ్చాయి. గ్యాస్ లీకేజీ తదితర అంశాలపై పలు సార్లు స్థానికులు ఆందోళన కూడా చేశారు.

ఈ నేపథ్యంలో రామగుండం ఎమ్మెల్యే స్పందించి ఫిర్యాదు చేయడంతో కర్మాగారం లో పిసిబి తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా 12 లోటుపాట్లు ఉన్నట్లు గమనించి కర్మాగార అధికారులకు సమాచారం ఇచ్చారు. లోపాలను సరి చేసే వరకు కర్మాగారాన్ని మూసివేయాలని సూచించారు. ప్రమాదాలు అధికంగా జరిగే ఆస్కారం ఉన్నా కర్మాగారం అయినా.. సిబ్బంది, స్థానిక ప్రజలకు సంబంధించి భద్రతా చర్యలు తీసుకోలేదని పిసిబి వివరించింది.

Read more RELATED
Recommended to you

Latest news