రాజకీయాల్లో కాన్ఫిడెన్స్ ఉండాలి గాని.. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. అలా ఉంటే రాజకీయంగా ఎదురుదెబ్బలు తగలడం తప్పదు. అయితే ఏపీలో ప్రధానంగా ఉన్న రాజకీయ పార్టీలు ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే ముందుకెళుతున్నట్లు కనిపిస్తున్నాయి. మొదట అధికార వైసీపీ 175కి 175 సీట్లు గెలుస్తామని చెబుతుంది. ఇది పక్కగా ఓవర్ కాన్ఫిడెన్స్. అందులో ఎలాంటి డౌట్ లేదు. 175కి 175 గెలవడం అసాధ్యం.
అటు టిడిపి సైతం తాము 160 సీట్లు గెలుస్తామని చెబుతుంది. ఇది కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ అనే చెప్పాలి. టిడిపికి అన్నీ సీట్లు వచ్చే ఛాన్స్ ఏ మాత్రం లేదు. సింగిల్ గా 100 సీట్లు గెలిచిన గొప్పే. అవి కూడా జనసేనతో కలిసి గెలవాల్సిన పరిస్తితి. అయితే మొన్నటివరకు పవన్ ఓవర్ కాన్ఫిడెన్స్‌కు వెళ్లలేదు. జనసేన-బిజేపి కలిసి వెళితే గెలవడం కష్టమని అర్ధం చేసుకున్నారు. తాము ఓట్లు చీలుస్తామని భావించారు. అందుకే ఓట్లు చీలకుండా టిడిపితో పొత్తుకు ఆయన రెడీ అయ్యారు. పొత్తు ఫిక్స్ చేసుకున్నారు. ఇక వీరితో బిజేపి కలిసి వస్తుందా? లేదా? అనేది తర్వాత విషయం.
మొత్తానికి టిడిపి-జనసేన పొత్తు ఫిక్స్ అయింది. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లాలో పవన్ నాల్గవ విడత వారాహి యాత్రలో పాల్గొన్నారు. అవనిగడ్డ సభలో ఆయన యథావిధిగానే జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో రాబోయేది జనసేన-టీడీపీ ప్రభుత్వమేనని, 2024 ఎన్నికల్లో కురుక్షేత్ర యుద్ధం జరగబోతోందని సీఎం జగన్ అంటున్నాడని.. ఈ యుద్ధంలో కౌరవులు వైసీపీ వాళ్లేనని చెప్పారు.
జనసేన-టీడీపీ కూటమి గెలుపు డబుల్ ఖాయం అని, రాబోయే ఎన్నికల్లో 175 సీట్లు వస్తాయని సీఎం జగన్ ప్రగల్భాలు పలుకుతున్నాడని, ఆయనకు 15 సీట్లు వస్తే గొప్ప విషయమని అన్నారు. ఇలా వైసీపీకి 15 వస్తే గొప్ప అనడం ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. ఎందుకంటే అధికారంలో బలంగా ఉన్న వైసీపీకి 15 కూడా రావన్నట్లు పవన్ మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఏపీలో లీడింగ్ లో ఉన్నది వైసీపీనే. ఆ పార్టీ ఇప్పటికిప్పుడు వందకు పైనే స్థానాల్లో బలంగా ఉంది. కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్‌కు వెళ్లకుండా, టిడిపి-జనసేన కలిసి కష్టపడితే గెలిచే అవకాశాలు మెరుగవుతాయి.