తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్. తెలంగాణ తలసరి ఆదాయం రూ. 3.08 లక్షలకు చేరుకూంది. 2022-23 ఏడాదికి గాను రాష్ట్ర ప్రజల వార్షిక తలసరి ఆదాయం ప్రస్తుతం ధరల ప్రకారం రూ. 3,08,732 అని తెలంగాణ పదేళ్ల ఆర్థిక అభివృద్ధి నివేదిక పేర్కొంది. దీనిలో 16 రాష్ట్రాల వార్షిక తలసరి ఆదాయాల వివరాలను ప్రస్తావించింది. ఏపీ తలసరి ఆదాయం గతేడాది రూ. 2.19 లక్షలని తెలిపింది.
జాతీయ తలసరి ఆదాయం రూ.1. 72 లక్షల కంటే తెలంగాణది 1.8 రేట్లు అధికంగా ఉండి… దేశంలోనే తొలి స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. ఇది ఇలా ఉండగా, తెలంగాణలోని గురుకులాల్లో 9,210 ఉపాధ్యాయ, అధ్యాపకుల పోస్టుల భర్తీకి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 1-22 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తారు. ఆగస్టు 10, 11, 12 తేదీల్లో పేపర్-1 పరీక్షలు… ఆగస్టు 1-7 వరకు JL, DL, PGT, TGT, లైబ్రరియన్, PD, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పేపర్-2 పరీక్షలు ఉంటాయి. పేపర్-1 పరీక్షల తర్వాత పేపర్-3 పరీక్షలు ఉంటాయి. పూర్తి వివరాలకు : https:// treirb.telangana.gov.in ను సంప్రదించాల్సి ఉంటుంది.