‘శభాష్ బండి కష్టపడి పనిచేస్తున్నావ్’… బండి సంజయ్ కు ప్రధాని మోదీ ఫోన్

తక్కుగూడ బీజేపీ సభ సక్సెస్ పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాసేపటి క్రితం ఫోన్ చేశారు. సభ సక్సెస్ పై శుభాకాంక్షలు తెలిపారు. శభాష్ బండి.. కష్టపడి పని చేస్తున్నారని మోదీ కితాబిచ్చారు. పాదయాత్ర చేసిన కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలపాలని బండి సంజయ్ కి ప్రధాని మోదీ సూచించారు. 

మీ స్ఫూర్తితో.. మీ సూచనలతోనే పాదయాత్ర చేపట్టానని.. రెండు విడతల్లో కలిపి 770 కి.మీలు నడిచాను’’ అని మోదీకి తెలిపారు బండి సంజయ్. నడిచేది నేనయిన నడిపించేది మీరని అన్నారు. పాదయాత్రలో ప్రజలు ఏం అంటున్నారని… బండి సంజయ్ ని ప్రధాని మోదీ ప్రశ్నించారు. దీనికి కేసీఆర్ పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. తెలంగాణలో కేంద్ర పథకాలు అమలు చేయకుండా కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ప్రధానికి సంజయ్ ఫిర్యాదు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షులు జె.పి. నడ్డాల రాకతో కార్యకర్తల్లో మరింత జోష్ పెరిగిందని చెప్పారు సంజయ్. ప్రధాన మంత్రి ఫోన్ తో కార్యకర్తల్లో నూతనోత్తేజం వస్తుందని బండి సంజయ్ ఆనందం వ్యక్తం చేశారు.