టీడీపీ ఇక ప్యాకప్… పొట్టలో కత్తులు పెట్టుకుని పొత్తులకు సిద్దమవుతున్నారు… అవన్నీ పొలిటికల్ ఫిలాసఫీ లేని పార్టీలు… పొలిటికల్ ఫిలాసఫీ తో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారు… అందుకే సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తు.. రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడుపిస్తున్నారనని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పిల్లల విద్యా కోసం నాడు నేడు, విద్యా దీవెన, అమ్మ ఒడి ఇలా అనేక కార్యక్రమాలు రూపొందించారు… గతంలో జన్మ భూమి కమిటీలు ఇచ్చినదే ఫైనల్ లిస్ట్…. ఇప్పుడు అ పరిస్థితి లేదు… పూర్తి పారదర్శకంగా అర్హులను గుర్తించి ఇవ్వడం జరుగుతుంది… గ్రామంలో పరిపాలన ఉండాలనే, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనను డీసెంట్రలైజ్ చేశారు… ఎందరు కలిసినా జగన్ మోహన్ రెడ్డి ని ఎదుర్కొలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
గడపగడపకు మన ప్రభుత్వంలో అందరూ పాల్గొంటున్నారు… ప్రజల మద్దతు లభిస్తుంది..ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు… పాలసీ లేకుండా .. విధానం లేకుండా పొత్తులు పెట్టుకుంటే పొట్టలో కత్తులు పెట్టున్నట్టే… ప్రశ్నా పత్రాల లీకేజీని చంద్రబాబు, అశోక్ వాల నాయకులూ సమర్ధిస్తారా అని అడుగుతున్నా.. మాల్ ప్రాక్టీసును మీరు సమర్ధిస్తున్నారా… సూటిగా చెప్పండని ఆయన ప్రశ్నించారు.