రైతుల కష్టాలు తీరాలని.. కాంగ్రెస్ లోకి వచ్చానని పోచారం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… Trs కంటే ముందు నేను టీడీపీ…. నా రాజకీయ జీవితం కాంగ్రెస్ తోనే మొదలైందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడి పదేళ్లు పూర్తి అయింది…
రేవంత్ నాయకత్వం లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిందన్నారు. రేవంత్ ని నేనే ఇంటికి ఆహ్వానించానని… రైతు పక్షపాత నిర్ణయం తీసుకుంటున్నారని కొనియాడారు. రైతుల కష్టాలు తీరాలని.. కాంగ్రెస్ లోకి వచ్చానని ప్రకటించారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఆరు నెలల పాలన చూశామని…. చిన్న వయసులోనే అన్ని సమస్యలు అవగాహన చేసుకుంటున్నారని ప్రశంసించారు.రాజకీయంగా నేను ఏం ఆశించడం లేదన్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డి.