రేషన్ కార్డు దారులకు తీపికబురు..10 కిలోల చొప్పున ఉచిత బియ్యం

-

రేషన్ కార్డు దారులకు తీపి కబురు. కేంద్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద…. ఉచిత కోట కేటాయిస్తూ అమలు చేస్తోంది. ఆహార భద్రత కార్డులోని ప్రతి లబ్ధిదారుడికి ఐదు కిలోల చొప్పున ఉచిత బియ్యం కేటాయించగా రాష్ట్ర ప్రభుత్వం మరో ఐదు కిలోలు కలిపి పది కిలోల చొప్పున అందిస్తూ వస్తుంది.

రేషన్ కార్డు
రేషన్ కార్డు

ఉచిత బియ్యం పథకం కాలపరిమితి మార్చి కోటతో ముగియడంతో కేంద్ర మరోసారి సెప్టెంబర్ వరకు ఈ పథకాన్ని పొడిగించింది. అయితే ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా ఏప్రిల్, మే మరియు జూన్ నెలలో ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయడం సాధ్యం కాలేదు. రూపాయి కిలో చొప్పున అందించారు. అయితే గత నెల చివరలో మాత్రం నెలసరి కోట పంపిణీ గడువు ముగియగానే యూనిట్కు ఐదుగుళ్లలో చొప్పున అందించింది.

ఈ నెలలో మాత్రం 10 కిలోల చొప్పున పంపిణీ చేయనుంది. ఆహార భద్రత కార్డు కలిగిన కుటుంబాలకు ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా యూనిట్కు పది కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ కానుంది. ఈ నెల నుంచి ఉచిత బియ్యం కోట పంపిణీ ప్రారంభిస్తున్నట్లు ఇప్పటికే అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news