తెలంగాణ రైతులకు శుభవార్త.. డీఏపీ, కాంప్లెక్సు ఎరువులుపై సర్కార్‌ కీలక ప్రకటన

-

తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పారు మంత్రి నిరంజన్‌ రెడ్డి. డీఏపీ, కాంప్లెక్సు ఎరువులుపై కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన డీఏపీ, కాంప్లెక్సు ఎరువులు జూన్ 15 నాటికి సిద్దం చేయాలని ఆదేశాలు జారీ చేశారు మంత్రి నిరంజన్‌ రెడ్డి.

హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలోని మంత్రి నివాసంలో నిర్వహించిన వానాకాలం ఎరువుల సరఫరాపై ఉన్నతస్థాయి సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వానాకాలానికి 24.45 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల కేటాయించామని.. ఇదివరకే కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ ఆమోదించిందన్నారు.

10.5 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా, 9.4 లక్షల మెట్రిక్ టన్నులు కాంప్లెక్సు ఎరువులు, 2.3 లక్షల మెట్రిక్ టన్నులు డీఎపీ, 2.25 లక్షల మెట్రిక్ టన్నులు ఎంఓపీ మరియు ఎస్ఎస్ పీ సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. మే నెలాఖరు నాటికి 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సిద్దంగా ఉంచాలని ఆదేశించారు మంత్రి నిరంజన్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news