ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది – VH

-

ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ కు మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు. కేసిఆర్ ఇంటికో ఉద్యోగం అన్నారు కానీ ఎక్కడ రాలేదని మండిపడ్డారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరినీ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ తో మంచి ఊపు వచ్చిందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే ఫ్యామిలీ ఇందిరా గాంధీదని అన్నారు వీ హనుమంతరావు. సొంత పార్టీ నేతలు కొందరు అడ్డుపడ్డా ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని గుర్తు చేశారు.

యూత్ డిక్లరేషన్ ను గ్రామ గ్రామానికి తీసుకువెళతామన్నారు. 1969లో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కేసిఆర్ లేరు, కేటీఆర్ లేరని.. ఆనాడు ఉద్యమం చేసిన చెన్నారెడ్డి, మదన్ మోహన్ వంటి నేతల పేర్లు కేసిఆర్ ఎందుకు చెప్పరని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన సోనియాను ఇంకా బ్లేమ్ చేయడం తగదన్నారు. తెలంగాణ వద్దన్న వారు మీ పార్టీలో ఉన్నారని దుయ్యబట్టారు. పార్టీని మెర్జ్ చేస్తేనే తెలంగాణ ఇస్తామని చెప్పకుండా ఆనాడు మేము తప్పు చేశామన్నారు విహెచ్.

Read more RELATED
Recommended to you

Latest news