తెలంగాణకు కొత్తగా 23 వేల కొత్త ఇండస్ట్రీలు వచ్చాయి – పువ్వాడ

-

తెలంగాణకు కొత్తగా 23 వేల కొత్త ఇండస్ట్రీలు వచ్చాయని పువ్వాడ అజయ్ కుమార్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పారిశ్రామిక దినోత్సవ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో అజయ్ కుమార్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన 9 సంవత్సరాల్లో కొత్తగా 23 వేల కొత్త ఇండస్ట్రీలు వచ్చాయి..2014 కంటే ముందు ఒక ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలంటే అనేక పర్మిషన్ల పేర్లతో కాలయాపన చేసేవారని ఫైర్‌ అయ్యారు.

కానీ ఇప్పుడు టీఎస్ ఐపాస్ ద్వారా దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోనే పర్మిషన్ ఇస్తున్న ప్రభుత్వం మాది….తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే పారిశ్రామికవేత్తలు పారిపోవాల్సిందే అన్నారు. కానీ కొత్త పరిశ్రమ కవితలే రాష్ట్రానికి వచ్చారని వివరించారు. గతంలో 50 వేల కోట్ల రూపాయల ఎగుమతులు ఉండేవని.. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2.47 లక్షల కోట్లు విలువ చేసే ఎగుమతలు చేస్తున్నామని చెప్పారు. ఐటీ సి ఉద్యోగాల్లో 41 శాతం ఉద్యోగాలు హైదరాబాదులోని ఇస్తున్నాం..ఐటీ ఉద్యోగాల్లో హైదరాబాద్ తర్వాత ఎక్కువగా ఇస్తున్న జిల్లా ఖమ్మం జిల్లా అని కొనియాడారు. ఖమ్మం ఐటీ హబ్ లో దాదాపుగా 800 మంది ఉద్యోగం చేస్తున్నారు….రెండో పేజ్ ఐటీ హబ్ కోసం 35 కోట్లు మంజూరు చేశారన్నారు.
సెకండ్ ఫేస్ ఐటి ద్వారా దాదాపుగా 2000 మంది కి ఉద్యోగాలు రాబోతున్నాయి..మరో 30 కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఖమ్మం గ్రానైట్ పరిశ్రమను ఆదుకుంటాం..గ్రానైట్ పరిశ్రమకు అవసరమైన వసతులపై చర్చిస్తామని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news