రాచరికపు అవశేషాలు తొలగించాల్సిందే.. ఘంటా చక్రపాణి ఆసక్తికర ట్వీట్..!

-

తెలంగాణ అంటేనే రాచరికానికి వ్యతిరేకమని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాచరిక ఆనవాళ్లకు ఇక్కడ చోటు లేదని, తెలంగాణ అంటే త్యాగాలు, పోరాటాలు గుర్తొస్తాయని చెప్పారు. ఈ క్రమంలోనే త్యాగాలు, పోరాటాలు గుర్తొచ్చేలా చిహ్నం, గేయం రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల మీడియా చిట్ చాట్ లో మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే, తెలంగాణ అధికారిక చిహ్నంలో కాకతీయ తోరణం, చార్మినార్ సింబల్ను తొలగించే నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడంతో వివాదస్పదంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా టీఎస్ పీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి ఆసక్తికర ట్వీట్ చేశారు.

రాచరికపు పోకడలు, ఫ్యూడల్ అవశేషాలు సమూలంగా తొలగించే చర్యలు ప్రభుత్వమే స్వయంగా చేపట్టాలని కోరారు. ముందుగా ఫ్యూడల్ ప్రతీకలుగా పేర్లలో ఉన్న కుల ఆనవాళ్లు తొలగించాలి. తొలగించుకోవాలి.. అని పేర్కొన్నారు. ద్రవిడ ఉద్యమం ఇలాంటి ప్రతీకలు తెచ్చిందన్నారు. పేరుకు ముందుండే వారసత్వపు ఇంటి పేరు, చివర ఉండే ఆధిపత్యపు కులం పేర్లను తొలగించిందని గుర్తుచేశారు. మరో ట్వీట్లో మీసం రాచరికపు అవశేషమని, పౌరుషం ప్యూడలిజపు ప్రతిరూపమని దాన్ని కొరిగెయ్యండని సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news