కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన లేదని, అవి మార్చడంపై ప్రజాభిప్రాయం తీసుకున్నారా? అని బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని మార్చడంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన బీఆర్ఎస్ కాంగ్రెస్ లపై విమర్శలు కురిపించారు. ప్రజా పాలన అనేది కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదని, లోగోను మార్చడం లేదా రాష్ట్ర గీతాన్ని మార్చడంపై ప్రజాభిప్రాయం తీసుకున్నారా? అని మండిపడ్డారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య తేడా లేదని.. రెండూ ధాన్యం సేకరణ, ఎరువుల సరఫరా, విత్తనాల కొనుగోలు, ఫోన్ ట్యాపింగ్ వంటి వాస్తవ సమస్యలను పరిష్కరించడానికి బదులుగా దారి మళ్లింపు వ్యూహాలను అవలంబిస్తున్నాయని ఆరోపించారు. అలాగే కేసీఆర్ కొడుకు హైదరాబాద్ అంటే చార్మినార్ అంటున్నాడు. కానీ అది అతనికి మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. హైదరాబాద్ అంటే భాగ్యలక్ష్మి దేవాలయం అని, అదే విధంగా ప్రసిద్ది చెందిందని అన్నారు. అంతేగాక భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించకుండా ఆయన్ని అడ్డుకున్నది ఏమిటి.? అని కేటీఆర్ ను బండి సంజయ్ ప్రశ్నించారు.