“అయినవారికి ఆకుల్లో..కానివారికి కంచాల్లో”..కెసిఆర్ పై రేవంత్ రెడ్డి విమర్శలు

-

సీఎం కేసీఆర్ పంజాబ్ లో మృతి చెందిన రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సీఎంపై టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. “అయినవారికి ఆకుల్లొ.. కాని వారికి కంచాల్లో అంటే ఇదేనేమో ! అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో రోజుకు ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఫామ్ హౌస్ గడపదాటి.. ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించని సీఎం కేసీఆర్.. పంజాబ్ రైతులకు పరిహారం ఇవ్వడంలో మర్మమేమిటో మన రైతన్నలకు అర్థం కాదనుకుంటున్నారా..? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

కాగా సాగు చట్టాల రద్దు కోసం జరిగిన పోరాటంలో మరణించిన రైతుల కుటుంబ సభ్యులకు, గల్వాన్ లోయలో చైనా సైనికుల దాడిలో అమరులైన సైనికుల కుటుంబాలకు తెలంగాణ సర్కార్ ప్రకటించిన నష్టపరిహారాన్ని చండీగఢ్ లో పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ నష్టపరిహారాన్ని అందజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news