కర్ణాటక ఎన్నికల ప్రచారంకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఈ మేరకు కాసేపటి క్రితమే కర్ణాటక బయల్దేరిన రేవంత్..ఇవాళ్టి నుండి ప్రచారంలో పాల్గొంటారు. కర్ణాటక ఎన్నికలో స్టార్ట్ క్యాoపైనర్ గా రేవంత్ రెడ్డి.. బరిలోకి దిగుతున్నారు. తెలుగు ఓటర్లను ప్రభావితం చేసేందుకే.. కాంగ్రెస్ రేవంత్ ను దించుతోంది.
కాగా, కాంగ్రెస్ కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా, కెపిసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, ప్రతిపక్ష నేత సిద్దరామయ్య పాల్గొన్నారు.
నిన్న బీజేపీ పార్టీ రిలీజ్ చేయగా, కాంగ్రెస్ కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. కాంగ్రెస్ గ్యారంటీ కార్డు పేరు తో ఇప్పటికే ఐదు హామీలతో కాంగ్రేస్ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం… ఇక 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది సర్కార్. ప్రతి ఇంటి గృహిణికి నెలకు 2000 రూపాయలు. వ్యక్తికి 10 కిలోల బియ్యం ఇస్తామని హామీ ఇచ్చింది.మహిళలకు రాష్ట్ర ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, యువనిధి పేరు నిరుద్యోగ భృతి క్రింద రూ. 3000, డిప్లమా చేసిన వారికి రూ.1500 ఇవ్వనున్నట్లు వెల్లడించింది కాంగ్రెస్.