మోడీ చీకటి మిత్రుడు కేసీఆర్ – బీజేపీ సభపై రేవంత్ కౌంటర్

మోడీ చీకటి మిత్రుడు కేసీఆర్ అని బీజేపీ సభపై రేవంత్ కౌంటర్ ఇచ్చాడు. “తెలంగాణ మిత్రులారా… తన చీకటి మిత్రుడు కెసిఆర్ పేరు కూడా ప్రస్తావించకుండా… కుటుంబ పాలన… అవినీతి ఊసెత్తకుండా… మోడీ గారి మిత్రధర్మం చూశారుగా…!” అంటూ రేవంత్‌ రెడ్డి సంచలన ట్వీట్‌ చేశారు. అంతేకాదు.. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌ ఫోటోలను షేర్‌ చేశారు రేవంత్‌ రెడ్డి.

బీజేపీ సభతో ప్రజలకు శబ్ద కాలుష్యం తప్పితే ప్రయోజనం లేదని.. తెలంగాణ కోసం త్యాగం చేసిన శ్రీకాంత చారి. జయశంకర్ ల ప్రస్తావన ఏది ? అని నిలదీశారు. మూడేళ్లుగా కెసిఆర్ అవినీతిపై మాటలు చెప్పిన బీజేపీ నేతలు ఇవాళ మోడీ స్పీచ్ లో ఎందుకు ఆ ప్రస్తావన లేదని ప్రశ్నించారు.

తెలంగాణ గడ్డ పై ఉండి…విభజనను తప్పు పట్టారని అమిత్ షా పై ఫైర్‌ అయ్యారు. ఎంత దుస్సాహసం చేశారు అమిత్ షా అని నిలదీశారు. మోడీ, అమిత్ షా తెలంగాణకు క్షమాపణ చెప్పాలి… కాళేశ్వరం అవినీతి పై మాట్లాడిన నేతలు… చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు..? అని ప్రశ్నించారు.