ప్రధాని మోడి ప్రసంగంపై తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పందించారు. తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలో డబుల్ ఇంజిన్ వస్తుందని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. మోడీ మాటల్లో అన్ని అబద్ధాలేనని… రోడ్లకు నిధులిచ్చింది లేదు..విదిలిచ్చింది లేదని విమర్శలు చేశారు. సిగ్నల్ ఫ్రీ సహచర మంత్రి కేటీఆర్ చొరవతోటేనని.. సిగ్నల్ ఫ్రీ ఆలోచన ముఖ్యమంత్రి కేసీఆర్ దన్నారు.
అమలు పరిచిన ఘనత మంత్రి కేటీఆర్ దని… ఇప్పటికే 46 చోట్ల సిగ్నల్ ఫ్రీ వ్యవస్థ అమలులో ఉందని పేర్కొన్నారు. ఇందులో కేంద్రం పాత్ర ఉందనడం అబద్దమేనని… రూ. 50 వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్న ఏకైక రాష్ట్రమన్నారు.
తెలంగాణ కంటే ఉత్తరప్రదేశ్ మూడింతలు పెద్దది…. మధ్యప్రదేశ్ రెండింతలు పెద్దది… అక్కడ ప్రభుత్వాలు సంక్షేమ రంగానికి ఖర్చు పెడుతుంది ఎంత ? అని నిలదీశారు. 2014 కు ముందు వెనుక అన్నది అధ్యయనం చేస్తేనే అభివృద్ధి గురించి తెలుస్తోంది… విద్యుత్ రంగంలో సాధించిన విజయాలు తెలంగాణ అభివృద్ధికి ప్రతీకలు అన్నారు. ఆ విజయాల వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత ఉందని చెప్పారు.