రేవంత్ రెడ్డికి తప్పకుండా ఆడబిడ్డల ఉసురు తగులుతుంది : కేటీఆర్

-

అకారణంగా, అసభ్యంగా సీఎం రేవంత్ రెడ్డి తమ పార్టీ మహిళా ఎమ్మెల్యేలను అవమానించారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో చిట్ చాట్ నిర్వహించారు. అక్కలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. తెలంగాణ మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం పదవీకి ఆయన అనర్హుడు.

ఆడ బిడ్డలను అవమానించిన రేవంత్ రెడ్డికి వారి ఉసురు తప్పకుండా తగులుతుంది. మా మహిళా ఎమ్మెల్యేలు సొంతంగా కష్టపడి 5, 6 సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు. ఎవ్వరూ ఆయనలా రాజకీయ విన్యాసాలు చేయలేదన్నారు. నోరు జారితే ఎవ్వరైనా వెనక్కి తీసుకుంటారు. కానీ ముఖ్యమంత్రి అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. మా ఇద్దరూ ఎమ్మెల్యేలు కష్టపడి ప్రజల మధ్యలో తిరిగి గెలిచిన గొప్ప ఆడబిడ్డలు. ప్రజల దీవెనలు, కార్యకర్తల ఆశీర్వాదంతో గెలిచి వచ్చారు. నీ లెక్క పార్టీలు మారి పదవులు తెచ్చుకున్న వాళ్లు కాదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి సిగ్గు తెచ్చుకొని బే షరత్ గా మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version