కేసీఆర్‌కు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ లేఖ

-

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్‌టైం అధ్యాపకులను క్రమబద్దీకరించాలని సీఎం కేసీఆర్‌కు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్​ఎస్ ప్రవీణ్‌ కుమార్‌ లేఖ రాశారు. అసెంబ్లీలో ప్రకటించిన.. 13 వేల 86 ఉపాధ్యాయ పోస్టులను నింపడం సహా బదిలీలతో ఏర్పాటయ్యే ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు డీఎస్సీ రాతపరీక్షలు 6 నెలలు వాయిదా వేయాలని లేఖలో కోరారు.

రాష్ట్ర సర్కార్ ప్రకటించిన 5వేల 89 టీచర్ పోస్టులను రోస్టర్ ప్రకారం విభజిస్తే సబ్జెక్టు, కేటగిరీల వారీగా ఒకటి రెండు పోస్టులు రావడం లేదని ప్రవీణ్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి ప్రకటించిన 13 వేల ఉద్యోగాలతో పాటు ప్రస్తుతం జరుగుతున్న ఉపాధ్యాయుల బదిలీలతో అదనంగా ఏర్పడే ఖాళీలతో కలిపి మొత్తం 23 వేల 65 పోస్టులు భర్తీ చేయడానికి ప్రవీణ్‌ కుమార్‌ డిమాండ్‌చేశారు. తక్షణమే అన్ని విశ్వవిద్యాలయాల్లోని పార్ట్‌టైం అధ్యాపకులను క్రమబద్ధీకరించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు. విద్యా ప్రమాణాల పెంపు, అభివృద్ధి, ఉన్నత విద్యాభివృద్ధి కోసం తోడ్పడాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రవీణ్‌ కుమార్‌ విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news