తెలంగాణ ఆర్టీసీలో టికెట్లు బంద్.. ఇకపై మెట్రో తరహాలో స్మార్ట్ కార్డులు !

-

తెలంగాణ ఆర్టీసీ సంస్థ అన్ని రంగాల్లోనూ దూసుకుపోతోంది. ఎప్పుడైతే సజ్జన్నర్ తెలంగాణ ఆర్టీసీ ఎండిగా బాధ్యతలు చేపట్టారో.. అప్పటినుంచి తనదైన స్టైల్ లో ఆర్టీసీని డెవలప్ చేస్తున్నారు. ఆర్టీసీ సంస్థలు లాభాల్లోకి తీసుకు వచ్చేందుకు చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఆర్టీసీ స్మార్ట్ గా టికెట్లను జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

దీని ద్వారా సమయాన్ని ఆదా చేయడంతో పాటు చిల్లర సమస్య అలాగే లెక్కల్లో తేడాలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది. డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల ద్వారా డిజిటల్ పేమెంట్ చేసి, టికెట్లు పొద్దేలా యంత్రాలను జారీ చేస్తోంది. మెట్రో రైల్ తరహా లోనే స్మార్ట్ కార్డులను జారీ చేయడంతో పాటు మొబైల్ ఫోన్ల లోనే, అన్ని రకాల పాస్ లు తీసుకునేలా చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news