రేపే తెలంగాణ టెన్త్ ఫలితాలు.. మంత్రి సబిత అధికారిక ప్రకటన

-

తెలంగాణ టెన్త్ ఫలితాలకు ముహుర్తం ఫిక్స్‌ చేశారు. పదో తరగతి ఫలితాలు బుధవారం అంటే రేపే వెల్లడి కానున్నాయి. మంత్రి సబిత ఇంద్రారెడ్డి… తెలంగాణ టెన్త్ ఫలితాలను మధ్యాహ్నం 12 గంటలకు రిలీజ్ చేస్తారు. 4.8 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. కాబట్టి టెన్త్ రిజల్ట్ అందరి కంటే ముందుగా manabadi.com లో తెలుసుకోవచ్చు.

ఫలితాలు విడుదల అవగానే యాప్ లో ప్రత్యేక స్క్రీన్ లో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి క్లిక్ చేస్తే సెకండ్లలోనే తెలిసిపోతుంది. ఇది ఇలా ఉండగా, తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం రెండవ సంవత్సర ఫలితాలను వెల్లడించిన తెలంగాణ రాష్ట్ర విద్య శాఖ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి … ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. జూన్ నాలుగు నుండి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని చెప్పారు సబిత ఇంద్రా రెడ్డి. పిల్లల పై తల్లి దండ్రులు ఒత్తిడి చేయకండని… మొదటి ,ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో చివరి స్థానం లో మెదక్ ఉందన్నారు. మొదటి స్థానంలో ములుగు ఉందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news