తెలంగాణ గడ్డ మీద తెలంగాణ తల్లికి అవమానం.. విమర్శిస్తున్న నెటిజన్లు..!

-

తెలంగాణ గడ్డ మీద తెలంగాణ తల్లికి అవమానం జరిగిందని నెటిజన్లు విమర్శిస్తున్నారు.   ప్రపంచ దేశాల నుండి వచ్చే పర్యాటకులను సైతం ఆకర్షించే విధంగా కేసీఆర్ నూతన సచివాలయం నిర్మించిన విషయం తెలిసిందే. ఇపుడు అది హైదరాబాద్ నగరానికి వచ్చే పర్యాటకులకు తప్పకుండా చూడవలసిన ప్రదేశంగా మారింది. అలాంటి సెక్రటేరియట్ ముందు, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవంగా భావించే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించి, ప్రపంచ పర్యాటకులకు మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్ర తెలుసుకునేలా చేయాలని గత కేసీఆర్ ప్రభుత్వం భావించింది.

ఇపుడు ఆ స్థలంలో కాంగ్రెస్ నేత, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ లోపల ప్రతిష్టించాలని రేవంత్ ప్రభుత్వం యోచిస్తోంది. ఇది నిజంగా తెలంగాణ తల్లిని అవమానించడమే కాకుండా, ప్రజలకు, పర్యాటకులకు అనుమతి లేని సెక్రటేరియట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం అంటే ఆ తల్లి దర్శనం ఇక లేనట్టే అని తెలంగాణ ప్రజల్లో చర్చ మొదలైంది. రేవంత్ రెడ్డికి అర్ధం అయ్యేలా చెప్పాలంటే బాహుబలి సినిమాలో దేవసేనను బంధించితే భల్లాలదేవకు ఏం జరిగిందో భవిష్యత్తులో అదే జరుగుతుంది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news