ఎమ్మెల్యే శంకర్ నాయక్,మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. నేను మానుకోట కొచ్చే సరికి ఈ ఎమ్మెల్యే భయం పట్టుకుందని…శంకర్ నాయక్ సైగ చెయ్యి చూద్దాం ఎవడు వస్తాడో చూస్తానని చాలెంజ్ చేశారు. ఆడది అయితే మాట్లాడకూడదా ఎర్రబెల్లి..?*నీకు దమ్ముంటే పబ్లిక్ ఫోరం పెట్టు అన్నారు.
శంకర్ నాయక్ బుజాలు తడుముకుంటున్నారని… నేను అడుగు పెట్టగానే భయం పట్టుకుందని నిప్పులు చెరిగారు. శంకర్ నాయక్ బెదిరించే దోరణిలో మాట్లాడుతున్నాడని…పాదయాత్రను అడ్డుకొనెలా కార్యకర్తలను ఉసి గొల్పుతున్నారని ఫైర్ అయ్యారు. ఎలా పాదయాత్ర చేస్తారో చూస్తా అనే బెదిరించే దోరణిలో మాట్లాడుతున్నారని… ఒక్క సైగ చేస్తే కార్యకర్తలు మాపై దాడి చేస్తారట అంటూ రెచ్చిపోయారు. శంకర్ నాయక్ కి వైఎస్సార్ బిడ్డ సవాల్ చేస్తుందని… మీకు దమ్ముంటే దాడి చేయండి చూద్దామన్నారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది కాదు YSR బిడ్డ అని పేర్కొన్నారు. ప్రజల పక్షాన నిలబడి,కొట్లడుతున్నందుకు భయపడాలా..? అని ఫైర్ అయ్యారు.