TSPSC కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. షర్మిల అరెస్ట్

-

తెలంగాణ వైసీపీ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల అరెస్టయ్యారు. వయా వైయస్ షర్మిల ఇవాళ టీఎస్పీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులతో టీఎస్పీఎస్సీ కార్యాలయానికి చేరుకున్న షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో ఆమె అక్కడ రోడ్డుమీద బైఠాయించారు. ఈ తరుణంలో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు… స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో టిఎస్పిఎస్సి కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇక అంతకుముందు మీడియాతో వైఎస్ షర్మిల మాట్లాడారు. నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్న నాపై LOOK OUT నోటీసులు ఇవ్వడం కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనంఅని ఫైర్ అయ్యారు వైఎస్ షర్మిల.

ఇప్పటికే రెండుసార్లు నిరుద్యోగుల తరఫున కొట్లాడకుండా హౌజ్ అరెస్ట్ చేశారు. ఇప్పుడు దుర్మార్గంగా LOOK OUT నోటీసులు ఇచ్చి, పోలీసులను ఉసిగొల్పుతున్నారని అగ్రహించారు వైఎస్ షర్మిల. TSPSC ప్రశ్నాపత్రాల కుంభకోణంలో సిట్ పెద్ద తలకాయలను వదిలేసి, చిన్న ఉద్యోగుల తప్పిదం మాత్రమే అని చూపే ప్రయత్నం చేస్తోంది. దీనిపై సీబీఐ ఎంక్వైరీ జరిపేంతవరకు YSR తెలంగాణ పార్టీ కొట్లాడుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news