కేసీఆర్ ను ఖమ్మం ప్రజలు తరిమితరిమి కొడుతారు – వైఎస్ షర్మిల

కేసీఆర్ ను ఖమ్మం ప్రజలు తరిమితరిమి కొడుతారని హెచ్చరించారు వైఎస్ షర్మిల. ఓటమి భయంతోనే ఖమ్మంలో కేసీఆర్ సభ పెట్టిండు. ఖమ్మం జిల్లాకు కేసీఆర్ చేసిందేంటి? భద్రాచలానికి రూ.వంద కోట్లు అని రూపాయి ఇవ్వలేదు. గోదావరికి కరకట్ట కట్టలేదు. పోడు భూములకు పట్టాలు ఇవ్వలేదు. సీతారామ ప్రాజెక్టు నిర్మించలేదు. కేసీఆర్ ఆయన పార్టీని ఖమ్మం జిల్లా ప్రజలు తరిమితరిమి కొడుతారని తెలిపారు.

ప్రజాప్రస్థానం పాదయాత్రను అడ్డుకొని కేసీఆర్ పెద్ద పొరపాటు చేశాడని… పాదయాత్ర ఎక్కడ అడ్డుకున్నారో అక్కడి నుంచే ఈ నెల 28వ తేదీన వైయస్ఆర్ బిడ్డ రెట్టింపు ఉత్సాహంతో ప్రజల్లో అడుగుపెట్టబోతుందని వెల్లడించారు.

ఈ పాదయాత్ర కేసీఆర్ పాలనకు అంతిమ యాత్ర అని పేర్కొన్నారు. ప్రజాప్రస్థానంపై కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా.. ప్రజాహితమే ధ్యేయంగా 3500 కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తి చేశాం. ప్రజల నుంచి వస్తున్న ఆదరణను తట్టుకోలేక పాదయాత్రపై దాడి చేయించి, అడ్డుకున్నాడు కేసీఆర్. ఇక, ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఈ నెల 28 నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తామన్నారు షర్మిల.