కల్వకుంట్ల కాదు కమీషన్ల చంద్రశేఖర్ రావు – వైఎస్‌ షర్మిల

-

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అయ్యాక తన పేరును కమీషన్ల చంద్రశేఖర్ రావుగా మార్చుకున్నారని వైఎస్‌ షర్మిల ఆగ్రహించారు. కమీషన్ల కోసమే ప్రాణహిత – చేవెళ్ల,పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులను రీ డిజైన్ చేశారని మండిపడ్డారు. కమీషన్లకు కక్కుర్తిపడి వైయస్ఆర్ కలల ప్రాజెక్టులను కేసీఆర్ ఖూనీ చేశారు.

జూరాల ద్వారా ఉమ్మడి పాలమూరులో 12లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని పాలమూరు-రంగారెడ్డి పథకానికి వైయస్ఆర్ రూపకల్పన చేస్తే.. దీనిని రీడిజైన్ చేసి, కమీషన్లు దోచుకుని, ప్రాజెక్టును మాత్రం పూర్తి చేయలేదని వెల్లడించారు.

వైయస్ఆర్ గారు రూ.38వేల కోట్లతో డా.బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నిర్మించి, 16లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని భావిస్తే.. కేసీఆర్ దీనిని కాళేశ్వరంగా రీడిజైన్ చేసి, రూ.లక్ష కోట్లు కుమ్మరించి ప్రాజెక్టు కడితే.. మూడేండ్లకే మునిగింది. 18 లక్షల ఎకరాలకు అని చెప్పి, రెండు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చామని చెప్పడానికి సిగ్గనిపించడం లేదా..? 2 లక్షల ఎకరాలకు లక్ష కోట్లు ఖర్చు పెట్టడానికి కేసీఆర్ కి బుద్ది ,ఇంగితం ఉండాలే కదా ! అని వివరించారు వైఎస్‌ షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news