హస్తంలో సీట్ల డిమాండ్..పొంగులేటికి సెట్ అవుతుందా?

-

తెలంగాణలో మొన్నటివరకు కాంగ్రెస్ పరిస్తితి కాస్త అయోమయంలో ఉంది. అసలు ఆ పార్టీ రేసులో కూడా కనిపించలేదు. బి‌ఆర్‌ఎస్, బి‌జేపిల మధ్యే పోలిటికల్ వార్ నడుస్తూ వచ్చింది. దీంతో కాంగ్రెస్ కాస్త వెనుకబడింది. అదే సమయంలో కాంగ్రెస్ లో ఉండే అంతర్గత సమస్యలు కూడా ఆ పార్టీకి నష్టం చేశాయి. అయితే ఇలాంటి సమస్యలతో కాంగ్రెస్ ఇబ్బంది పడుతుంది. కానీ నిదానంగా పార్టీలో మార్పు మొదలైంది.

- Advertisement -

పార్టీలో సీనియర్ నేతలు ఏకమవుతున్నారు. పార్టీ కోసం మళ్ళీ పనిచేయడం మొదలుపెట్టారు. కాస్త విభేదాలు కూడా పక్కన పెడుతున్నారు. ఇలాంటి తరుణంలోనే పక్కన ఉన్న కర్నాటక రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి రావడం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు వచ్చింది. అక్కడ వన్ సైడ్ గా కాంగ్రెస్ విజయం సాధించి..అధికారంలోకి వచ్చింది. అయితే కర్నాటకలో గెలిచినంత మాత్రాన తెలంగాణలో కాంగ్రెస్ బలపడుతుందని అనుకోవడానికి లేదని, బి‌ఆర్‌ఎస్, బి‌జే‌పి నేతలు అంటున్నారు. అయితే వారు అనుకున్నా సరే..కొంతమేర ప్రభావం మాత్రం ఉందని చెప్పాలి. ఎందుకంటే పక్కనే కర్నాటక ఉండటం, తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండటం, వారి మైండ్ సెట్ ఎలా ఉందో అర్ధమవుతుంది.

కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కాస్త ఊపు వచ్చింది. దీంతో ఇప్పుడు నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఖమ్మం జిల్లాలో కీలకంగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం ఖాయమని తెలుస్తోంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ లో కొన్ని సీట్లలో డిమాండ్ ఎక్కువగా ఉంది. అది కూడా నల్గొండ, ఖమ్మం లాంటి జిల్లాల్లో ఇంకా డిమాండ్ ఉంది. అయితే పొంగులేటి ఏమి తన అనుచరులకు ఖమ్మంలో సీట్లు ఇప్పించుకోవాలని చూస్తున్నారు. కానీ అక్కడ కాంగ్రెస్ నేతలు చాలామంది ఉన్నారు. మరి అలాంటప్పుడు పొంగులేటి కాంగ్రెస్ లోకి వచ్చి ఎంతమంది అనుచరులకు సీట్లు ఇప్పించుకుంటారో చూడాలి. మరి పొంగులేటి కాంగ్రెస్ లోకి వస్తారా? లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...